Sampoornesh Babu: బిగ్ బాస్ రియాల్టీ షో నుంచి రావడం నా దురదుష్టం...సంపూర్ణేష్ 6 d ago

సంపూర్ణేష్ బాబు నటించిన 'హృదయ కాలేయం' సినిమా విడుదలై 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, ఆయన తన కెరీర్ను గుర్తు చేసుకున్నారు. తనకు హీరోగా తొలి అవకాశం ఇచ్చిన దర్శకుడు సాయి రాజేశ్కు కృతజ్ఞతలు చెప్పారు. అలాగే, ఈ చిత్రాన్ని ట్వీట్ చేసి ప్రచారం చేసిన దర్శకుడు రాజమౌళికి ధన్యవాదాలు తెలిపారు. మధ్య తరగతి కుటుంబంలో పుట్టి, బంగారు ఆభరణాలు తయారు చేసుకుంటూ, సినిమాలపై ప్రేమతో 'హృదయ కాలేయం' ద్వారా గుర్తింపు పొందినట్లు చెప్పారు. ఈ సినిమా తర్వాత ఆయన జీవితం మారిందని, ఆటోల్లో తిరిగే ఆయన విమానాలు ఎక్కారని చెప్పారు. బిగ్ బాస్ రియాల్టీ షో నుంచి బయటకు రావడం తన దురదృష్టమని పేర్కొన్నారు.